సిరియా కళాకారుడి ఎనిమిదేళ్ల అద్భుతం! బంగారు దారంతో పవిత్ర ఖురాన్ ని రూపొందించారు.
సిరియాలోని అలెప్పోకు చెందిన మహమ్మద్ మహేర్ హజెరీ అనే కళాకారుడు కుట్టు మిషన్ ఉపయోగించి బంగారు దారంతో మొత్తం పవిత్ర ఖురాన్‌ను ఒక వస్త్రంపై కుట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.
ఆయన 1998 నుండి 2010 వరకు సదాదాపు 12 సంవత్సరాలు ఈ పని చేశారు.
ఓ నల్ల వెల్వెట్ వస్త్రాలపై బంగారు పట్టు దారంతో తయారుచేసిన ఈ ఖురాన్ మొత్తం సంపుటాలు 12. దీని మొత్తం బరువు సుమారు 200 కిలోలు. పగలు రాత్రి తేడా లేకుండా, ఆయన ఓర్పుతో, అంకితభావంతో ఈ మొత్తం పని చేశారు.
దీనిని తొలిసారిగా 2025 రియాద్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో కూడా ప్రదర్శించారు.
భవిష్యత్తులో ఈ అరుదైన కళాఖండాన్ని ఒక మ్యూజియంలో భద్రపరచాలన్నది ఆయన ఆకాంక్ష.
దీనిని సొంతం చేసుకోవడానికి దాదాపు 25 లక్షల డాలర్ల ఆఫర్ వచ్చినప్పటికీ, ఆయన దానిని అమ్మడానికి నిరాకరించారు. తాను దానిని డబ్బు కోసం కాకుండా, కేవలం అల్లాను కీర్తించడానికే సృష్టించానని చెప్పారు.
అలెప్పోకు చెందిన ఈయన, ప్రస్తుతం వాయువ్య టర్కీలోని బుర్సాలో నివసిస్తున్నారు. ఆ ప్రతిని అందరూ చూసేలా ఒక మ్యూజియంలో భద్రపరచాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
తన లక్ష్యం ఆర్థిక లాభాలు కాదని, అందుకే ఖురాన్ ప్రతిని అమ్మడం లేదని ఆయన చెప్పినట్లు ఆర్టీ అరబిక్ పేర్కొంది.
హజెరీ ఆ ప్రతిని కాలిగ్రఫీ చేయడానికి నాలుగు సంవత్సరాలు, పద్యాలను బంగారు దారంతో కుట్టి, పేజీలను అలంకరించడానికి మరో నాలుగు సంవత్సరాలు గడిపారు.
ఇలావుండగా, అజర్‌బైజాన్ కళాకారిణి తుంజాలే మెమ్మెడ్జాదే, పారదర్శకమైన నల్ల పట్టు వస్త్రంపై బంగారు అక్షరాలతో ఖురాన్‌ను చేతితో రాశారు. ఆమె మూడేళ్ళ శ్రమతో ఇది రూపుదిద్దుకుంది.
తన పరిశోధనలో ఖురాన్‌ను అనేక విభిన్న పదార్థాలపై లిఖించినట్లు కనుగొన్నానని, అయితే ఇంతకు ముందెన్నడూ పట్టు వస్త్రంపై రాయలేదని తుంజాలే చెప్పారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి