కోటి దండాలు.. శతకోటి దండాలు...;- కొక్కుర వేంకట శేష ఈశ్వరరావు - విజయ(బెౙ)వాడ
కోటి దండాలు.. శతకోటి దండాలు...
కోటి దండాలు...శతకోటి దండాలు...

కాళహస్తిలో... మీరూ...మేడం
మాపై చూపిన ఆదరానికి......   //కోటి//

1) శివయ్య గుడిలో దర్శనానికి...
 కమ్మగా... పెట్టిన భోజనానికి...
 మీ ఇరువురినీ కలిసినప్పుడు...
 మనసుతో మాకు స్వాగతమిచ్చిన
  మీ దంపతులకు.....  //కోటి//


2)ఇరువురు చూపిన ఆదరానికి
    ఇంటిలో ఇచ్చిన ఆతిథ్యానికి...
    మా....‌ ఇద్దరికీ..... 
     ‌          చేసిన విందుకు....
               చూపిన ప్రేమకు....   //కోటి//

3)  స్నేహపూర్వక పరామర్శలకు.....
     హృదయపూర్వక పలకరింతలకు..
     సాహితి మిత్రులు బాలు గారికి 
     వారి జీవన సహచరి భార్గవి గారికి....//కోటి//
===========================================================


(ఎంతోమందిని ఆదరంతో, సాదరంగా ఆహ్వానించి వారి ఇంటిలో చక్కని పలకరింతలతో ఆతిథ్యమిస్తూ, అటు బడిలో పిల్లల మనసు దోచుకుంటూ, ఇటు... మరి ఇంటిలో మనలాంటి వారందరి (బంధుమిత్రుల)మనసు దోచుకునేటటువంటి మనందరికీ  మిత్రుడు,  సన్నిహితుడు, ఆత్మీయుడు కయ్యూరు  బాలసుబ్రమణ్యం (బాలు ) గారింటికి నిన్న,  28-04-2026న, వెళ్ళినప్పుడు వారి ఆతిథ్యం స్వీకరించిన మీదట, చిన్న సంతోషంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ
సరదాగా వ్ర్రాసిన పేరడీ పాట...

 కొక్కుర వేంకట  శేష ఈశ్వరరావు -   విజయ(బెౙ)వాడ
కామెంట్‌లు