ఉన్నంతలో కాళ్లు ముడుచుకోవడం అన్న సామెత ఆశల గోతిలో పడింది.
పల్లెలు, పట్టణాలై
ఇళ్ళు కట్టడాలు, దండగ ఖర్చులు పెట్టడాలు పెరిగి,
కరిగిపోయింది డబ్బు విలువ.
స్థాయికి మించిన విలాసాలు,
విల్లాలు, కార్లు
జీవితానికి ప్రేమ ఆప్యాయతల కన్నా మిన్న.
ఇవన్నీ సమకూరాలంటే
కావాలి గదమ్మా
డాలర్లు,
ఒక ఊరికి పోను భయపడే పల్లెటూరిమొహాలు పలకరిస్తేచాలు ఇప్పుడు అమెరికా విషయాలపంచాంగం వినిపిస్తున్నారు.
తమది అమెరికా ఆస్ట్రేలియా అన్నట్టు ఫోజులి స్తున్నారు.
అభివృద్ధికిఆటంకం కలగకూడదు. కానీ అదే పరమార్థంఅనుకోవడం అనర్థం. కుంటి పిల్లయిన
ఇంటి పిల్ల మేలు అనే సామెత జ్ఞాపకం పెట్టుకోవాలి. జననీ, జన్మభూమి
వద్దనుకున్న వారు సవతి తల్లితో సర్దుకుపోవాలి మరి.
సంపాదించుకో
ఆ సంతోషం సొంతవారితో వచ్చి పంచుకో.
ప్రవాసాంద్రులు
పోయి సంపాదించుకొని,
విల్లాలు కొనుక్కోవడం
కాదు. తన విద్యతో,ధనంతో జన్మభూమికి చేయందించాలి.
ప్రస్తుతం ఈనాటి ప్రవాసాంధ్రులను
చూస్తే
అర్థమవుతుంది పరిస్థితి. మింగ లేక కక్కలేక
రాలేక ఉండలేక మానసిక వ్యధ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి