చెప్పానని అనుకో వద్దు : - డా. సి వసుంధర.
1 అంతో ఇంతో కవినై
పోయా/
చూచింది చెప్పాలని
నా కలానికి
ఉబలాటం ఎక్కువ /
ఆరాటం మొదలైతే
ఇక
ఆపడం ఎవరితరం/
 
2  చిన్న చిన్నవే అనుకొండి
విన్నవారికవి
మణి😢
మాణిక్యాలు/

3  పదిమందిలో
పరువుగా ఉండాలంటే
మాటతీరు బాగుండాలి/

4  బాగున్నారా అని
ఎవరైనా అంటే
ఎం బాగులెండి 
అని మొదలెట్టకండి/

5  చిరు నవ్వుతో కలిపి
అంతా క్షేమమే అనండి
హాయిగా/

 6 భార్య భర్తలు
అబ్బో ఇంట్లో ఎంతో
ఒద్దిక/
నలుగురిలో కొస్తే
స్టుపిడ్ ,పూల్ లాంటి
పద ప్రయోగ దక్షత
అయ్యగారికి అలలై పొంగు/
అమ్మగారికీ మాడుమొహం .మాటకు మాట ఓ కుమ్ములాట/

7   అవసరమా అప్పుడు
ఆనందంగా గడపండి
అన్యోన్యంగా ఉండండి/

8  పదిమందిలో పట్టి పట్టనట్లు ఉండాలి/
చూచి చూడనట్లు
ఎవరినైనా చూడాలి/
ఉన్నచోటు మరిచి
కన్నార్పకుండా చూస్తే
మన్నించరు జనాలు
మర్యాదగా ఉండదు/

9  ఎవరైనా తింటున్నా 
వడ్డిమ్
చుకొంటున్నా
అటువైపు మనం చూస్తే వారిపనికి
ఫుల్స్టాపే సుమండి/

10  ఏపని చేసినా ఎమ్మాట్లాడినా
మనల్ని మనం
మరిచి పొగూడదు/
ఎదుటివారితో మృదువుగా 
మసలుకోవాలి/కాలానుభవంలో
నేనేర్చుకొన్నవే
మీకు చెప్పాను/
తప్పుగా తలచక
చేసి చూడండి /


కామెంట్‌లు