గౌరవం ఒకరిస్తే వచ్చేది కాదు
నైతిక ప్రవర్తనతో సమాజాహితమే నా ధ్యేయమని
కర్తవ్యాన్ని మరువక మనసా వాచా కర్మణా ఆచరించే
వ్యక్తిత్వం గల మనిషి గౌరవం వర్ణింప తరమా
అన్నార్తుల ఆకలి తీర్చడం
అసూయ అహంకారాలు లేక
ఎంత ఎదిగిన ఒదిగి ఉండి
ఆపదలో ఉన్నవారికి అభయహస్తం ఇచ్చే మానవుడు
జగతిన గౌరవనీయుడు
తండ్రి మాటకై కానలకేగిన శ్రీరాముడు
పతియే ప్రత్యక్ష దైవమని భర్తను అనుసరించిన సాధ్వి సీతమ్మ
శాంతి అహింసలే సాధనాలుగా స్వాతంత్ర్య సముపార్జన చేసిన గాంధీ మహాత్ముడు
స్త్రీ జనోద్ధరణకై కష్టాలు పడిన పూలే దంపతులు
పేపర్ బాయ్ నుంచి క్షిపణి పితామహునిగా వినుతికెక్కి అత్యున్నత దేశాధ్యక్షునిగా ఎదిగిన
భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలామ్
ఎందరో మహానీయులు
తమ వ్యక్తిత్వం ద్వారా గౌరవం పొందిన చిరస్మరణీయులు
అందుకే గౌరవం పొందిన వ్యక్తి జీవితం వసుధైకానికే ఆదర్శం....!!
............................
గౌరవం: - కవి మిత్ర, సాహిత్య రత్న -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్. (పుష్యమి)-హైదరాబాద్
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి