పావురాలు. : -డా ప్రతాప్ కౌటిళ్యా.
కఠిన జలాన్ని మింగిన మట్టి తొట్టి 
పెద్ద పాములా విషయాన్ని మింగి 
ఎర్రబడ్డ సూర్యుని గడ్డను తాకింది.
తరతరాల తలరాతలు రాస్తున్న తాబేలు ఇప్పుడు
 సముద్రం వదిలి భూమిని ఆక్రమించాలనుకుందీ.

పగిలి చిట్లిన ఆకాశం నోట్లో నాలుకలు మెల్లిమెల్లిగా భూగోళం వైపు చూస్తున్నాయి. 
విషాన్ని అమ్ముతున్న ఈశ్వరుడు ఇప్పుడు శనీశ్వరుడయ్యాడు. 
బండరాళ్ల కడుపుల్లో మహా పర్వతాలు కరుగుతున్నాయి. 
ఇంద్రధనస్సు లాంటి నెలవంకల్ని నీలి సంద్రం ఆహ్వానిస్తుంది. 
అర్థనగ్న చీకటి శుద్ధ జలంతో దీపం వెలిగిస్తుంది. 

కోటల్నీ ప్రాకే ఉడుముల్లా మేఘాల్నీ ఢీకొన్న
 ఉరుములు మెరుపులు ధర్మ గంటల్ని పగలగొట్టినవి. 
నిశ్శబ్ద నిప్పు ఆకాశాన్ని కాల్చేసిందీ
అడవుల్లాంటీ తోటల్నీ తోటమాలుల్నీ పేల్చేసిందీ
పారుతున్న విషపు నదులు గాలి ప్రాణాల్ని తీయలేదు 
తెల్లని పావురాల్లా మనుషులు మారువేషంలో ఎగురుతున్నారు. 

డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా.

కామెంట్‌లు