రామచిలుక : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
రాగి చెట్టు మీదున్నది రామచిలుక 
రామ రామంటుంది రంగుల చిలుక 
రమ్యంగా పిలుస్తూ రత్నాలచిలుక 
రయ్యమని లేచింది గయ్యాలి చిలుక 

తోటలోకి వెళ్ళింది తీట చిలుక 
దొర పండు కొరికింది బెరికి చిలుక 
దొరబాబుకిచ్చింది పిరికి చిలుక 
రెపరెప లేచింది తుపాను  చిలుక 

చింత మీద చేరింది వింత చిలుక 
చిగురంత తెంపింది పొగరు చిలుక 
పొట్టి పాపకు ఇచ్చింది గట్టిచిలుక 
గబగబా లేచింది దుబాయ్ చిలుక 

వేప చెట్టు మీద వాలింది వెర్రిచిలుక 
కిలకిల పలికింది కిలాడి చిలుక 
గూటిలోన దూరింది పాటిమీది చిలుక 
కిలకిల పలికింది కలికి రామచిలుక


కామెంట్‌లు