ఫారసీ కొత్త సంవత్సరం! సేకరణ :-అచ్యుతుని రాజ్యశ్రీ

 మొగల్ సంస్కృతిపైఫారశీ సభ్యత ముద్రపడటంతో నౌరోజ్ అంటే కొత్త వత్సరం పేరుతోఅక్బర్ జహంగీర్ షాజహాన్  వసంతోత్సవాలు నిర్వహించేవారు. మార్చి నెలలోపచ్చదనం పూలతో తోటలు కళకళలాడేవి.యాపిల్ ఓషధీమొక్కలు మొలకెత్తిన పప్పులుతో బల్లలని అలంకరించేవారు. బాదం పిస్తాలతో కుంకంపువ్వులేసి రకరకాల స్వీట్స్ తయారుచేసేవారు. సంగీత కచేరీలు నృత్యాలు కథక్ నాట్యం,మిమిక్రీ కళాకారులతో కవుల షాయిరీలతో కవ్వాలీ  ముషాయిరా గజల్స్ తో గానాబజానా సాగేది.
ఇక ఇస్లామీ హిజరీ సాల్(మొహరం తొలిరోజు) గంభీర ఆధ్యాత్మిక చింతన తో కురాన్ పఠనంతో  పాదుషాలు గడిపారు.సామాన్య ప్రజలు మాత్రం కొత్త పంటలతో గ్రామాల్లో సంతలో రకరకాల ఆటబొమ్మలు, మిఠాయి పశువుల సంత లో ఉషారుగా గడిపేవారు. కోతుల్ని ఆడించేవారు  ,తాడుపై నడిచే దొమ్మరాళ్లు తో కళకళలాడేవి.అక్కడికి సూఫీ వేదాంతులు వచ్చి ఆశీస్సులందించి మంచిమాటలు చెప్పేవారు .ఇలా మొగల్ కాలంలో ఫారశీ నౌరోజ్,ఆధ్యాత్మిక శోభ, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలతో మూడు రకాల వేడుకలు ఏడాదిలో జరిగేవి🌹
కామెంట్‌లు