నేను. : -డా ప్రతాప్ కౌటిళ్యా.
తోలు తిత్తిని నేను 
గాలి తిత్తిని నేను 
నీటి తిత్తిని నేను 
క్రొవ్వత్తిని నేను....?!?

నీలిరంగు నక్షత్రాన్ని నేను 
నీలిరంగు ముత్యాన్ని నేను. 

నీలాకాశం 
నన్ను కలుపుకోలేదు 
నీలి సముద్రం 
నన్ను గర్భంలో దాచుకోలేదు. 

అవును 
నేను నీలిరంగు చిత్రాన్ని!
అవును 
నేను నీలిరంగు రత్నాన్ని.!!

పాలెం పెంటయ్య స్మృతిలో. 

డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూలు జిల్లా.

కామెంట్‌లు