వేద, నాద స్థానం: - డా.సి.వసుంధర చెన్నై.
నాదేశం భారతదేశం.
దివ్య సందేశ
సద్గాధల
సస్యశ్యామల క్షేత్రం

ఓంకారం మాకు సాక్షాత్కారం 
శ్రీ కారం మా శుభాక్షరం.
సంస్కృత భాషా భాషణ,పరిచయ భాగ్యం
మా సౌభాగ్యం.

వేదాలకు నిధి
బోధనలకుపెన్నిధి.
సాధకులకు చలవ పందిరి 
పురాణాలు  మధురఫలాలు
కావ్యాలు మాదేశపు కనక సింహాసనాలు 
మాకవులు, 
రవి కైరవి సదృశులు .
నదులు,జలధులు అవధులు లేని అమూల్య సంపదలు. 

త్యాగం మా దేశపు
మూలమంత్రం.
భోగం,అనురాగం 
మాకు తెలియనివి కావు.

రససిద్ధుల
రసవాదనైపుణ్యం,  జాంబూనది పారిన నేలలో వసూత్పత్తి
బంగారుకు జాంబూనదం 
అన్న నామం. సార్థకం
వసువు విశేష రీతిలోనిండిన  మన భరతభూమి వసుంధర.
 ధరపై
కన్నేసిన అన్య దేశస్తుల నాదరించిన అమృతమూర్తి
మన దేశమాత

మన వైజయంతి జరుపుకోవాలి కోటాను కోట్ల పుట్టిన దినాలు. ఎర్రకోటపై ఎగరాలి
విశాలాంబరపు
అంచులుతాకుతూ.
తలలు పండిన నాయకులు,విలువలెరిగిన ప్రజలు తలలు వంచి నమస్కరించి
పాడెదరు
వందేమాతరం సుజలాం  సుఫలాం..... వందేమాతరం మాదే భారతం.🇧🇴🙏🏼🙏🏼👨🏻‍✈️

కామెంట్‌లు