బాలకాండము శ్రీమద్రామాయణము:- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
సుందరమైన శరీరము గల కందర్పుడను వాడు
ఆ ఆశ్రమమునందు నివాసముండేవాడు 
అక్కడ సమీపములో శివుడు తపస్సు చేయగా 
శివ తపస్సు భంగము చేసినాడు ఆ కామెడీ 

అప్పుడు ఆ మహాశివుడు కోపముతో అతనిని చూడగా 
అతని శరీరావయములు దగ్ధమైపోయెనట
అతడినే కాముడు మన్మధుడు అని అంటారు 
భస్మముకాగా అతడు అశరీడయినాడు

అప్పటినుండి మన్మధుడు 
అనంగుడు అను పేరుతో ప్రసిద్ధుడైయినాడు
మన్మధుడు తన అంగములను త్యజించిన కారణంగా 
శ్రీమంతం ఈ దేశము అంగ దేశముగా ప్రసిద్ధి చెందినది

ఆశ్రమ ప్రదేశమున శివుడు తపస్సు చేసినందువలన 
ఆ పవిత్ర స్థలం నందు మునులు శివ భక్తులు నివసిస్తారు 
ధర్మ పారాయణం చేస్తారు వారికి ఎట్టి పాపాలు అంటావు 
విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు తెలిపినాడు

ఆ మహర్షి రామలక్ష్మణుల సంభాషణను 
అచటి నివసించే మునులు తపోశక్తితో విన్నారు 
వారి వద్దకు చేరి 
ఆశ్రమంలోకి తీసుకెళ్ళినారు 
ఆ రాత్రి ధర్మాత్ముడైన విశ్వామిత్ర 
మహాముని తో రామలక్ష్మణులు గడిపినారు 


కామెంట్‌లు