సంపత్కారకుడు - శివుడు: - కవి మిత్ర , సాహిత్యరత్న-అయ్యలసోమయాజుల ప్రసాద్.-(పుష్యమి)-విశాఖపట్నం
సృష్టి, స్థితి, లయ కర్తలయిన
త్రిమూర్తులలో శివుడు లయకారకుడు.
శివాజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు
మార్కండేయునికి చిరంజీవత్వాన్ని
ప్రసాదించిన ప్రాణప్రదాత.
అడిగిన వెంటనే వరాలు ఇచ్చే భోళా శంకరుడు...!!

ప్రమద గణాలచే  అను నిత్యం
ఆరాధింపబడే మహనీయుడు.
గ్రహాలన్నీ శివుని ఆధీనంలో ఉంటాయి.
అందుకే శివారాధన అత్యంత శ్రేయస్కరం.
నమః శంభవేచ మయోభవేచ             నమః శంకరాయచ
మయస్కరాయచ అని
నారికేళ జలంతో శివుని అభిషేకం సర్వ శుభకరం..!

సగరపుత్రుల సద్గతికై
భగీరథుని తపస్సుకుమెచ్చి
పరమ పవిత్రమైన గంగను
మనకందించిన లోకోద్ధారకుడు.
విష్ణు సహస్రనామంలో
మోక్షానికి కారణమైన 
శ్రీరామ రామ రామేతి అన్న
తారకమంత్రాన్ని మనకందించి
మానవ జీవితాలను ఉద్ధరించిన పరమాత్ముడు..!!

ఆదిశంకరులకు చండాలుని రూపంలో
దర్శనమిచ్చి, అహంకారాన్ని పోగొట్టి
కులమతభేధాలు లేవని
జీవులందరు పరమాత్మ స్వరూపాలే అని
ఆత్మజ్ఞానాన్ని అమరత్వాన్ని
ప్రసాదించిన పుణ్యమూర్తి.!

ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రం
 భక్తి శ్రద్ధలతో పఠించిన    పాపాలను పారద్రోలు
లోక కల్యాణార్ధం గరళంను
కంఠం లోనే ఉంచుకుని
కాపాడిన కారుణ్యమూర్తి
ఎన్నని చెప్పను, ఏమని చెప్పను
శివలీలలు వర్ణింప తరమా?
అందుకే  జగతిన శివుడు
సంపత్కారకుడు....!!

 లోకా సమస్తా సుఖినో భవంతు.
..................................


కామెంట్‌లు