మనుషుల్ని వెంట తీసుకెళ్లాలి.!?: -డా ప్రతాప్ కౌటిళ్యా.,-సునీతా ప్రతాప్.
మనం ఒక్కరం ఒంటరిగా నడవడం కాదు 
మన వెంట మనుషుల్ని తీసుకెళ్లా లీ!!
ఎలా తీసుకెళ్లాలి 
ఆలోచనలతో భావోద్వేగాలతో శాస్త్రీయతతో 
మనం మనుషుల్ని మన వెంట తీసుకెళ్లాలి!!?

మనం ఒంటరిగా నడవడం కాదు 
మన వెంట మనుషుల్ని తీసుకెళ్లాలి 
ఎలా తీసుకెళ్లాలి!?
మాటలతో పాటలతో ఆటలతో 
సంస్కృతితో సాంస్కృతికతతో 
సాంప్రదాయాలతో సత్ప్రవర్తనతో 
మనం మనుషుల్ని మన వెంట తీసుకెళ్లాలి.!!?

మనం ఒంటరిగా నడవడం కాదు 
మనం మన వెంట మనుషుల్ని తీసుకెళ్లాలి 
ఎలా తీసుకెళ్లాలి!!?
నీతితో నిజాయితీతో విలువలతో 
న్యాయంతో నమ్మకంతో 
మనం మనుషుల్ని మన వెంట తీసుకెళ్లాలి.!!

మనిషి ఒంటరిగా నడవడం 
పరిణామం.!
మనుషుల్ని వెంట తీసుకెళ్లడం 
ప్రయాణం.!!
మనిషి ఒంటరిగా నడవడం 
ప్రమాణం! 
మనుషుల్ని వెంట తీసుకెళ్లడం 
పరిణయం!!

మనిషి ఒంటరిగా నడవడం కాదు 
మనుషుల్ని వెంట తీసుకెళ్లాలి.!!!.

డా ప్రతాప్ కౌటిళ్యా 
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.

కామెంట్‌లు