వితా.. ఓ కవితా.. : - నామ వెంకటేశ్వర్లు,-జి. ప. ఉ. పా. అయిటిపాముల,-కట్టంగూర్, నల్లగొండ
కష్ట జీవి కష్టాలు 
కడతేరే వరకు 

నిత్యావసర ధరలు తగ్గి 
అగ్గువకు అన్ని అందె వరకు 

అన్యాయం, అవినీతి,అక్రమాలు 
అగనంతవరకు 

మాటలే తప్ప చేతలు లేని
వరుస వాడి పొనంతవరకు 

సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానతలంతరించనంతవరకు
 
జనం తిండి పై అంక్షలు పెట్టి దాడులు చేయడమాపనంతవరక

ప్రశ్నించే కుత్తుకలను కత్తిరించే 
సంప్రదాయం చావనంతవరకు 

అన్యాయపు తీర్పులిచ్చినవారికనంతరం            
అందలమెక్కించే తతంగం దాగనంతవరకు 

బలమైన దేశాలు బలహీనమైన వారిపై
అజమాయిషీ ఆపేవరకు 

కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు కుప్పకూల్చి సమాజం కుదురుగా ఉండేవరకు 
 
యుద్దాన్ని నిలువరించి శాంతిని నెల్కొల్పేవరకు 

ఇంకా... ఇంకా... ఎన్నో.. ఎన్నెన్నో..అందుకే 

కవిత నిలిచి ఉండాలి  
నిబ్బరంగుండాలి 
నిక్కచ్చిగుండాలి
నిజాన్ని నిగ్గు తేల్చ కలకాలముండాలి


కామెంట్‌లు