సహాయం అడిగేవాడు సమస్య కాదు. వారు కేవలం మనుషులు.
బతకడానికి, ఊపిరి పీల్చుకోవడానికి, జీవించడానికి ప్రయత్నిస్తున్నారు.
కానీ, ఎవరికైతే పుష్కలంగా ఉందో…
అయినా ఇంకా ఎక్కువ తీసుకుంటారో
అక్కడే సమతుల్యత లోపిస్తుంది.
అవసరంలో ఉన్నవారు వాన నుండి తలదాచుకోవడానికి
ఆశ్రయం అడుగుతారు. దురాశపరులు
ఎంత పెద్ద కప్పులు కడతారంటే,
ఇతరులు తుఫానులో నిల్చుని తడిసి ముద్దవాల్సిందే.
అవసరం అనేది సహజం.
మనందరికీ ప్రేమ, మద్దతు, ఆహారం, భద్రత కావాలి. అందులో సిగ్గుపడా ల్సిన పనిలేదు.
కానీ దురాశ…
‘సరిపడా’ అనేది ఎప్పటికీ సరిపోనప్పుడు అది దురాశ అవుతుంది.
కరుణ కంటే సంపద పోగుచేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నప్పుడు,
మనుషుల కంటే అధికారానికే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నప్పుడు,
నెమ్మదిగా, నిశ్శబ్దంగా —అసమానతలూ పెరుగుతాయి.
అలాగే దయకూడా మాయమవు తుంది.
అలాగే మానవత్వం తనను తాను మరచిపోతుంది.
నిజం చాలా సులభం. పంచుకునే మనుషులతో నిండిన ప్రపంచం స్వస్థత చేకూరుస్తుంది.
కూడబెట్టుకునే జనాలతో నిండిన ప్రపంచం బాధపడుతుంది.
కాబట్టి అవసరాల గురించి సిగ్గుపడక్కర్లేదు. ఐతే కోరికల పట్ల అవగాహనతో ఉండాలి.
ఎందుకంటే లక్ష్యం ఎక్కువ సంపాదించడం కాదు, లక్ష్యం తక్కువ అవసరపడి ఎక్కువ ఇవ్వడమే.
అక్కడే…
నిజమైన సంపద మొదలవుతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి