పట్టాలి పదాలు
నెట్టాలి కవితను సమూహంలో
మోగేను చప్పట్లు
కప్పేరు పట్టు దుప్పట్లు
ఇదే నేటి సాహిత్యపు తీరు
బుర్ర పెట్టి ఆలోచన ఎందుకు?
అందరివీ చదివి ఒక్కో ముక్క చెక్క ఏరేసెయ్!
ఎంచక్కా పదాలు అటూ ఇటూ పెట్టేసి పక్కాగా కవిత రాసేయ్
అంతగా చదవరు ఎవరూ!
చదివినా,పోనిద్దూ, మనకెందుకు
అని ఊరుకునే కాలం!?
బడిపిల్లల కాపీలకు పనిష్మెంట్
పెద్దలకు లేదు వడ్డించే ఇన్ స్ట్రుమెంట్!?
కొట్టాలి కాపీ(నకలు): - అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి