బాల్యంలోనే ఉత్తమ బాల సాహిత్యం అందించి బాల్యాన్ని చక్కగా తీర్చి దిద్దాలనీ, భవిష్యత్తులో ఉత్తమ పౌరసమాజం నిర్మించబడుతుందనీ, బాలలు రచయితలుగా, సమాజనిర్మాతలుగా రాణించాలని ప్రముఖ బాలసాహిత్య రచయిత, పరిశోధకులు డా.వాసరవేణి పర్శరాములు అన్నారు.
శనివారం సింగారం ప్రాథమిక పాఠశాలలో ఉదయం 11.00లకు " బాలల గేయ రచన" పై కార్యశాల నిర్వహించారు. బాలసాహిత్య రచయిత డా. వాసరవేణి పర్శరాములు బాలలు ప్రతి ఒక్కరు పాటలు, కవిత్వం రాయవచ్చుననీ, పిల్లలకు అందుబాటులో ఉన్న అమ్మ, నాన్న, గురువులు, ఇల్లు, పాఠశాల, రైతు, కూలీ, పంటలు, చదువు పిల్లలకు సంబంధించిన అన్ని కోణాల్లో స్పందించి గేయాలు, కవిత్వం రాయవచ్చునన్నారు. బాల్యం అమూల్యమైనదనీ చక్కగా మలుచుకోవాలనీ, నైతిక మానవతా విలువలు పెంపొందించుకోవాలని, తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించాలనీ, భవిష్యత్తులో మేధావులుగా, సమాజం నిర్మాతలుగా రాణించాలని అన్నారు.తాను ప్రాథమిక విద్య ఈ పాఠశాలలోనే చదివాననీ, చక్కగా చదువాలన్నారు. ఈ సంవత్సరం పిల్లల రచనలతో పుస్తకం తేవాలని తనవంతు సహకారం ఉంటుందన్నారు.
మాతృ తెలుగు భాషలో పఠనం, లేఖణంలో రాణించిన 29 విద్యార్థులను "తెలంగాణ తెలుగు భాష సంఘం"యొక్క ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. టీచర్లను సన్మానించారు.
అనంతరం స్కూల్ హెచ్.ఎం & స్టాఫ్ పర్శరాములును శాలువాతో సత్కరించారు.
ఈకార్యక్రమంలో బా
ల సాహితీవేత్త తెలుగు యూనివర్సిటీ బాలసాహిత్య కీర్తి పురస్కార గ్రహీత డా.వాసరవేణి పర్శరాములు, సింగారం గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనిమేని యెల్లారెడ్డి, ఉపాధ్యాయులు బొల్లి నవీన్, వాసరవేణి దివ్య, గొల్లపల్లి వనిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి