తెలంగాణ సారస్వత పరిషత్ , శాంత వసంత ట్రస్ట్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఏర్గట్ల మండలం ఉన్నత విద్యార్థులకు కథ అనే ప్రక్రియ పై సాహిత్య కార్యశాలను ఏరుగట్ల ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరిగింది. విద్యార్థులు సాహిత్య సృజనాత్మకత ను పెంపొందించుకోవడం కోసం, వారిలో ఉన్న మెళుకువలను బయట పెట్టడం కోసం తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మండలంలో ఉన్న అన్ని పాఠశాలల నుండి 60 మంది విద్యార్థులను ఎంపిక చేసుకొని సమన్వయకర్త పాఠశాల తెలుగు పండితులు ప్రవీణ్ కుమార్ శర్మ మరియు విషయ నిపుణులు శ్రీ తాడూరి గంగాధర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విద్యార్థులు సాహిత్యం పైన మక్కువ పెంచుకోవాలని , కథలను కవితలను రాయడం ద్వారా మంచి విషయాలు తెలుస్తాయని తద్వారా మంచి ఆలోచనలతో మన జీవితాన్ని ఆనందకరమైన జీవితం గా మార్చుకోవచ్చని, అదేవిధంగా చిన్నప్పటినుండి సాహిత్యం పైన అభిలాష పెంచుకుంటే మంచి గుర్తింపు కూడా లభిస్తుందని ప్రవీణ్ కుమార్ శర్మ తెలియజేశారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకతను బయటకు తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయని, కార్యశాల లో నేర్చుకున్న విషయాలు ఎప్పటికప్పుడు సాధన చేయాలని తెలిపాడు. తర్వాత విద్యార్థులచే కథలను రాయించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంస పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుమ్మిర్యాల్, తాళ్ల రాంపూర్, కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు మమత, కళ్యాణి, రాజయ్య పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ఏరుగట్ల ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సృజనాత్మక కార్యశాల.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి