అన్ని తెలిసిన శ్రీరాముడు
సిద్ధాశ్రమ వృత్తాంతము గూర్చి
ఏమి తెలియనట్లు మునిని అడిగానాడు
రామా విను నీకు వివరముగా తెలిపెద
శ్రీమహావిష్ణు వందల యుగాల క్రితం
లోక కళ్యాణముకై తపస్సు ఆచరించినాడు
వామనావతారమునకు ముందు
విష్ణువు తపసిద్ధిని పొందినాడు
మహాతాపస్వి కాశ్వవుడు
తపస్సుచే ఫలసిద్ధి పొందినాడు
అందువలన సిద్ధాశ్రమము అంటారు
రాముడు మహర్షి మాటలు శ్రద్ధగా విన్నాడు
విష్ణువు తపస్సు చేసే కాలమునందే
విరోచనుని కుమారుడు బలి చక్రవర్తి
మరుద్గాణములను ఇంద్రాది దేవతలను జయించి
ముల్లోకాలనేలుతూ రాజుగా ప్రసిద్ధి కేక్కినాడు
బలి చక్రవర్తి యజ్ఞము చేయుచుండగా
దేవతలంతా అగ్నిదేవుని ముందు ఉంచుకొని
ఈ ఆశ్రమమునందు తపస్సు చేసి
మహావిష్ణువును దర్శించుకొన
బలి రాజ్యమును దానము పేరుతో తీసుకొనే మాకివ్వు శ్రీహరి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి