సంఘ సంస్కర్త కందుకూరి: - కవి మిత్ర, సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.(పుష్యమి) -విశాఖపట్నం
 సమాజాభివృద్ధికి  స్త్రీ విద్య తోడ్పడుతుందని  బాలికల విద్యకై పోరాడిన  మహనీయులు.
బాల్యవివాహాలు, అంధవిశ్వాసాలను తన రచనల ద్వారా వ్యతిరేకించిన సంఘ సంస్కర్త.
సమాజంలో జరిగే అవినీతి అరాచకాలను తన వివేకావర్ధిని పత్రిక ద్వారా ధైర్యంగా చాటిన ధీశాలి.
వ్యతిరేకత ఎదురైనా వితంతువివాహాలను  ప్రోత్సహించిన స్త్రీ జనోద్ధరాకులు వీరేశలింగం
పుస్తక పఠనం విజ్ఞానప్రదమని గ్రంథాలయ స్థాపనకు శ్రీకారం చుట్టిన  విజ్ఞాని.
చినిగిన చొక్కానైన ధరించు కానీ మంచి పుస్తకం వదలకని చెప్పిన సరస్వతీ పుత్రులు .
విగ్రహారాధన  మూఢనమ్మక పూజలను వ్యతిరేకించి మానవత్వమే మాధవత్వమని చాటిన సమాజ సేవకుడు.
బాలురతో సమానంగా బాలికలకొరకై పాఠశాలలను ప్రారంభించి  బాలికల విద్యను ప్రోత్సహించెను.
సామాన్యులకు  అర్ధమయ్యే వ్యవహారిక భాషలో రచనలు చేసిన తొలి తెలుగు రచయిత.
సంసారమనే బండికి స్త్రీ పురుషులిరువురు సమానమని  తన స్వీయచరిత్రను ధర్మపత్నికి అంకితమిచ్చారు.
రాజశేఖరచరిత్రను ,చిన్నయసూరి వదిలిన నీతిచంద్రికను పూరించి ఎందరికో రచనలలో ప్రేరణచేసారు. 
హితకారిణి ధర్మసంస్థస్థాపించి తన ఆస్తినంతా వ్రాసిన త్యాగశీలి వీరేశలింగం పంతులు!!
..............................


కామెంట్‌లు