*తే.గీ"*
కాపురేడునిరంగుల-క్రాంతిమెరియ
వర్ణపూరితబొమ్మలు-వన్నెలీయ
తీర్చిదిద్దెనుచిత్రాలు-కూర్చిఘనము
కళలరంగముమెచ్చిన-కాపుసుతుడు
*తే.గీ"*
పల్లెపడచులపరువాలు-పరవసింప
గొల్లభామలసొగసుల-గొప్పగాను
జానపదములచరితమ్ము-జాలువార
మలచినాడుగకుంచెచె-వలచినటుల
*కం"*
మక్కువమీరగరంగుల
చక్కని బొమ్మలనువేసి-చతురతతోడన్
మిక్కిలిమగువలమూర్తుల
చిక్కగమలిచెనుగకాపు-చిత్రములలరన్
***. ***
===================================

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి