వడదెబ్బ: -డా. కందేపి రాణీప్రసాద్
వడదెబ్బలండీ వడదెబ్బలండీ
ఎండల్లో తగిలే వడదెబ్బలు

అధిక ఎండల్లో తీవ్ర జ్వరం 
వాంతులు తలనొప్పితో 
స్పృహ తప్పి ప్రాణపాయం 

వడదెబ్బలండీ వడదెబ్బలండీ
ఎండల్లో తగిలే వడదెబ్బలు

తల తిరిగి మైకం కమ్మడం
వికారం ఎర్ర బర్పు చర్మం 
మైకం కమ్మి ప్రమాదం 

వడదెబ్బలండీ వడదెబ్బలండీ
ఎండల్లో తగిలే వడదెబ్బలు

చల్లని నీటితో తుడిచి 
నీడలో పడుకోబెట్టి
ద్రవాలు తాగించాలి 

వడదెబ్బలండీ వడదెబ్బలండీ
ఎండల్లో తగిలే వడదెబ్బలు

ఎండల్లో తిరగవద్దు 
మజ్జిగ తాగాలి 
వడదెబ్బ నివారించాలి

వడదెబ్బలండీ వడదెబ్బలండీ
ఎండల్లో తగిలే వడదెబ్బలు

కామెంట్‌లు