మనందరికీ భారత కురుక్షేత్ర యుద్ధం ధర్మరాజు పట్టాభిషేకం వరకు తెలుసు.కానీ ఈస్త్రీపర్వం గూర్చి తెల్సుకుందాం.
కొడుకులు చనిపోటంతో ధృతరాష్ట్రుడు అంతులేని దుఃఖంలో మునిగితే సంజయుడు ఓదార్చాడు. ఐనా అతని చిత్తం శాంతించకపోటంతో ధర్మాత్ముడైన విదురుడు ఓవృత్తాంతం చెప్పాడు."ధృతరాష్ట్రా! ఓబ్రాహ్మణుడు అడవిలో వెళ్తుండగా దొంగలు అడవిమృగాలు కన్పడ్డాయి.భయపడిపరుగెడ్తూ ఓబావిలో పడ్డాడు.ప్రాణాలు దక్కించుకునేందుకై ఒక తీగనుపట్టుకుని తలకిందులుగా వేలాడసాగాడు. నూతిలో పాము కన్పడటంతో హడిలిపోయాడు. బావి గట్టున ఓచెట్టు దానికి తేనెతుట్టె ఉంది.అక్కడ నుంచి తేనె చుక్కలు కింద పడుతుంటే బ్రాహ్మణుడు ప్రాణాలు దక్కించుకునే ఆశతో ఆతేనె చుక్కల్ని చప్పరించసాగాడు. చూశావా! మనిషి ప్రాణం పోయే స్థితిలో కూడా బతకాలనే ఆశపడ్తాడు. మరి వాటి వివరణ విను.అడవి అంటే మనిషిసంసారం కుటుంబం.దొంగలు అంటే రోగాలు ఈతిబాధలు.పాము అంటే మనల్ని వెన్నంటి ఉండే మృత్యువు.చెట్టు అంటే మనిషి ఆయుష్షు. తేనెచుక్కలు మనిషి ఆశలు కోరికలు.ధృతరాష్ట్రా! నీవు ఇక ఏడ్చి లాభంలేదు. ఉత్తర కర్మలు చేయి" అంతే! ఆయన మళ్లీ ఏడ్పు మొదలు పెట్టాడు.మూర్ఛ పోయాడు.అప్పుడు వేదవ్యాసుడు వచ్చి ధృతరాష్ట్రునికి తెలివి తెప్పించి ఇలా హితోపదేశం చేశాడు" పుత్రా! ప్రాణి కి పుట్టుక చావు తప్పదు.యుద్ధానికి కారణం దుర్యోధనుడు.అతన్ని నీవు సమర్ధించావు. అందరిమాటలు పెడచెవిన పెట్టావు. స్వయంకృతాపరాధం కదా ఇదంతా! ఇప్పటికైనా పాండవుల్ని నీ సొంత కొడుకులుగా భావించి ప్రేమించు.వారు మీదంపతుల్ని కన్నబిడ్డలులాగా ప్రేమించి సేవజేస్తారు.శోకాగ్నిని నీ జ్ఞానమనే నీటితో ఆర్పేయి. " అంతే! ధృతరాష్ట్రుని శోకం తగ్గింది.పాండవులతో సఖ్యంగా ఉంటానని మాట ఇచ్చాడు.వ్యాసుడు సంతోషించి అంతర్ధానమైనాడు🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి