అహంకారమే అపజయానికి కారణం: - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-విశాఖపట్నం.

 శ్రీమద్రామాయణ0  వసుదైకానికే ఆదర్శకావ్యం.  రామ రావణ యుద్ధంలో శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించి సాధ్వి సీతమ్మతో కూడి అయోధ్య నగరానికి వచ్చి పరదేవతా స్వరూపమైన మాతృమూర్తి కౌసల్యా మాత పాదచరణాలకి నమస్కరించి నప్పుడు ఆశీర్వదిస్తు  చతుర్వేదపారంగతుడు, పరాక్రమవంతుడు, నిత్య శివపూజా భక్తాగ్రేసరుడు  మహిమాన్విత శివ తాండవ స్తోత్రం వ్రాసిన  రావణాసురుని ఎలా జయించావు రామచంద్రా అని అడిగింది. శ్రీరాముడు వెంటనే వినమ్రతతో అమ్మా రావణ బ్రహ్మ వంటి పాండిత్య ప్రతిభ కలిగిన వారు  పరాక్రమవంతుడు ముల్లోకాలలోనే లేరు కానీ ధర్మం తప్పి అహంకారంతో పరస్త్రీ వ్యామోహం  వలన అతను అపజయం పొందాడు.  అతని అహంకారమే అపజయానికి కారణమని బదులు చెప్పాడు
అందుకే ఎంత ఎదిగినా ధర్మం తప్పక అహంకారం లేనివానికెప్పుడు పరాజయం కలుగదు...!!
................................
 
కామెంట్‌లు