నిలబడతావా!?:-డా ప్రతాప్ కౌటిళ్యా
నీవు ఉన్నా లేకున్నా పర్వాలేదనే
లోకంలో 
నీకు లోకం కావాలా...

నీ దాహం తీర్చని సముద్రం ముందు 
నీవు నిలబడతావా..!?
గాలిలో దీపంలా నీవు వెలుగుతావా.!?

వడగళ్ల వానలో హిమాలయాల్లా నిలబడతావా.!!?
పచ్చిక బయళ్ళు ఎన్ని ఉన్నా 
పక్షులు వాలే పచ్చని చెట్టులా నిలబడతావా.!?

ఆకాశానికి చేరిన 
కోరీ భూమిపై నదిలాపారుతావా!?
ఎన్నో ఇంద్రధనస్సులను విరిచి 
మెరుపులా మెరిచీ  ఉరుములా ఉరుముతావా.!?

నక్షత్రాలు రాల్చిన ఉల్కల ముందు 
తెరిచిన నాలుకల్లా నిలబడతావా.!!?

డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూలు జిల్లా.

కామెంట్‌లు