సామెత -204: ఆ గొడ్డు మంచిదైతే ఆ వూల్లెనే అమ్ముడు వోతది
****
"అవ్వా! నీకెరికేనా?కాంతమ్మత్త ముచ్చెటి? పెట్టే బేడా సద్దుకోని ఇక్కడ బడ్డదాక వొచ్చింది. రాంగ రంగనే ఇంటి పక్కామెతో పేద్ధ లొల్లి బెట్టుకుందట.గీ ముసల్ది మల్లెందుకొచ్చింది? ఊల్లోల్లని పశాంతంగ ఉండనియ్యక అని అందరూ గుసగుసలు పెట్టుకుంటుర్రు."
"అవునా శెల్లె! రానూ వచ్చుడయ్యింది.అప్పుడే కయ్యానికి కాలు దువ్వుడు షురూ జేసిందా? ఏం మడిషో ఏమో శెల్లే?
అవునవ్వా! అమ్మ,కొడుకూ ఇద్దరూ ఇద్దరే. "పొట్లకాయ పొరుగు ఓర్వదు" అన్నట్టు ఉంటరు."
" గింతకీ ఇంటి పక్కామెతో లొల్లి ఎందుకు బెట్టుకుంది శెల్లే?"
" సవత్సరం సంది ఇల్లు కాళీగుందా? ఇంటిపక్కనిల్లు కాత్త ఊడ్సి ముగ్గు వెడ్తే ఏమాయె!అంటదట.గీమింటి ముందల గా మెందుకు వెడ్తది. ఇంతకు ముందోపాలి ఇంటికి అటు పక్కన ఉన్నామె పక్కపక్కనోళ్ళం అన్కుని ఆకిలి ఊడ్సి ముగ్గు వెడ్తే, నా ఇల్లు ముందు నువ్వెందుకు పెట్టినవని పంచాతి బెట్టిందంట.
శెల్లే !కాంతమ్మత్తన్నా? గామె కొడుకన్నా ఊల్లె దెల్వనోళ్ళు లేరుగా !: గందుకే వొచ్చిన సంవందాలు వొచ్చినట్టే వోతున్నయి.
అవునవ్వా!ఇక్కడ ఊల్లె అంత కల్శి ఒక్కపట్టయి జమిడికేసుకుంటే ఉండలేక పక్కూరికి ఎల్లిపోయింది. అక్కడ సక్కంగ ఉందా? పతొక్కరితో లడాయేనాయే. గందుకే ఒళ్ళు సుత అంత కల్శి ఊల్లె నించి ఎల్లగొట్టి ఉంటరు."
గందుకే అంటరు శెల్లె! "ఆ గొడ్డు మంచిదైతే ఆ వూల్లెనే అమ్ముడు వోతది" అని.
"అంటేందవ్వా?"
" గొడ్డు పనికిరాందో పనికొచ్చేదో మొదటి సంది సూశినోళ్ళకి తెల్సినట్టయితే ఎవలైన కళ్ళకద్దుకొని కొంటరు. ఊల్లెనే అమ్ముడు వోతది.గట్లనే మడిషి సుత. కాంతమ్మత్తా, గామె కొడుకు మంచోడైతే గీ వూల్లె గానికి దగ్గ సంవందాలు ఎన్ని లెవ్వు. శెప్పు శెల్లె. గందుకే గట్ల పోల్శి శెప్తరు.
నిజవేఁ అవ్వా! బలే ఇడమర్సి శెప్పినవ్. ఇంగనన్న కాంతమ్మత్త,గామె కొడుకు మారితేనే ఊల్లే యిలువుంటది.పెళ్ళయితది.
గదండీ సంగతి " "ఆ గొడ్డు మంచిదైతే ఆ వూల్లెనే అమ్ముడు వోతది అంటే గిదే మరి. సమజైంది కదా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి