గగుర్పుడిచే ఉదయం. -డా ప్రతాప్ కౌటిళ్యా.
లోహ చూర్ణం లాంటి దేహం మూసల్లో పోసి 
ఆవిష్కరించిన మోహం అందమైన నమూనాల్లో 
నిశానిచ్చినట్లు
ఆలోచనల్ని చీల్చి తిత్తుల్లోకి వొంపితే మత్తెక్కించే 
స్పర్శల్ని ముఖాల్లో దింపి కోరికల స్వప్నాల్ని పుట్టించిన 
తోటి ప్రశ్నల్ని భూస్థాపితం చేసినట్లు 
సమాధానాలు సరిగానే తిరగబడ్డావీ.

ఎదురుపడే బీకర ఆకారాల్నీ ముక్కలు ముక్కలుగా నరికి 
వీధుల్లో మాంసపు అమ్మ కాలనీ ప్రవేశపెట్టినట్లు 
అభిరుచి వేసనంతో సావాసం చేసి సన్యాసం స్వీకరించిన 
ప్రతిరూపాలని కన్నా కపటపు కాటుక కన్నుల్ని ప్రవేశం నిషేధించినట్లు 
రెప్పలు రెక్కలు కట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి. 
మౌనంగానే నిప్పంటించిన కన్నీరు అగ్నిపర్వతంలా ఉప్పొంగింది. 
ఆశల ప్రవేశం ఆశ్చర్యంతో వేదిక ముందు దిగంబరంగా పేలింది. 

అస్పష్టపు నిశ్శబ్దం భాస్వరంలా మండీ గుండెల్ని పిండింది 
నిర్భయపు గాయం చిందించిన రక్తం ఎర్రని మంటల్ని సృష్టించింది. 
నకిలీ నమూనాలు విరిగి నదుల్లా పారిపోతున్నాయి. 
ఒక్కొక్క అడుగు లెక్కించిన పాదాలు గతం ముందు కంచుకోటలా ప్రతిష్టించబడింది. 
ఎగిరి పడ్డ వికారాల్ని మధ్యలోనే పెద్ద పాము మింగింది. 
మెలికలు తిరిగిన సత్యం బయటపడడం కోసం భయాన్ని ఊహల్లోనే చంపింది. 

సహాయం ఆశించిన శవం స్మశానానికి చేరకుండానే నలుగురితో పరిగెత్తింది. 
దూరం తగ్గినా జీవితం తగ్గి జీవించినా 
ఒళ్ళు గగుర్పుడుచే ఉదయాల్నీ మాయం చేసింది. 


పూనె లత ఇంట్లో 

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు