మానవత్వమే మాధవత్వమని
శాంతి అహింసలే సాధనాలుగా
స్వాతంత్య్ర సముపార్జన చేసి
కులమత బేధాలు లేని సమ సమాజ నిర్మాణం ఏర్పడాలని
అర్ధరాత్రి స్త్రీ నడిరోడ్డుపై ఒంటరిగా ప్రయాణం చేసినపుడే అసలయిన స్వాతంత్య్రం వచ్చినట్లన్న
ఓ మహాత్మా
స్వాతంత్య్ర వజ్రోత్సవ సమయంలో కూడా
మానవత్వం మరచి మృగాలకన్న హీనంగా
కులమత బేధాలతో సమాజాన హింస ప్రజ్వల్లింప చేస్తు
అసూయా ద్వేషాలతో నేడు జరుగుతున్న నరమేధ యాగాలు,
అర్ధరాత్రి కాదు పగటి పూట కూడా పాలు గారు పసిపిల్లలనుంచి పండు ముదుసలి వరకు
స్త్రీలపై జరిగే అత్యాచారాలను చూస్తుంటే
ఓ మహాత్మా నీవు కాదు మరల సాక్షాత్తూ
శ్రీకృష్ణ పరమాత్మ వచ్చినా
కరోనా చేసిన కరాళనృత్యం చూసి కూడా
మారని మనుషులను చూసి
అశాశ్వతమైన జీవితాన్ని శాశ్వతంగా భావించే
వీరిని మార్చగలరా?..!!
.................................
(మనిషిలో మార్పు రావాలి. గాంధీ పుట్టిన, శ్రీకృష్ణుడు వచ్చిన మారని నేటి సమాజ స్థితిని ఆర్ద్రతతో వ్రాసినది)
..............................
మహాత్మా నీవు మరల పుట్టినా మార్చగలవా ? : - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-\ విశాఖపట్నం.
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి