వశిష్టుని ఉపదేశము దశరథుని అంగీకారం : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
దేవతలు ఋషులు అసురులు రాక్షసులు 
గంధర్వులు యక్షులు కిన్నరులు నాగులు 
అస్త్రశాస్త్రమందు దివ్య దృష్టి యందు
ఎవరు కూడా విశ్వామిత్రునికి సమానులు కారు 

పూర్వం విశ్వామిత్రుడు రాజ్యపాలన చేయగా 
కృశశ్వుడను రాజు పరమధార్మికుడు 
తన కుమారులను అస్త్ర రూపములో 
విశ్వామిత్ర మహాశికి ఇచ్చినాడు 

జయ సుప్రభ అను దక్షిణ కన్యలు సుందరాంగులు 
ప్రకాశవంతమైన నూరు హస్త్రములను సృష్టించినారు 
జయ అను నామే మిక్కిలి శక్తి సంపన్నురాలు 
శ్రేష్టులైన ఏబది మంది కుమారులన కన్నాదట

సుప్రభకు సంహారులను పేరు గల ఏబదిమంది పుత్రులు 
వారు అపజయమేరుగని మిక్కిలి బలవంతులు 
విశ్వామిత్ర మహర్షి అస్త్రములన్నింటినెరుగును
ఇతడు అపూర్వమైన అస్త్రములు కలిగినవాడు 

శ్రీరాముని పంపుటకు సందేహము వలదు రాజా 
నీ కుమారునికి మేలుకూర్చుటకు వచ్చినాడు
వశిష్ట మహర్షి హిత మాటలు విని దశరథుడు 
శ్రీరామునంపుటకు మనస్ఫూర్తిగా అంగీకరించాడు


కామెంట్‌లు