రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయ స్వీయ అనుభవాలతో కూడిన స్పూర్తి గాథల సంకలనం ఉపాధ్యాయ స్పూర్తి పుస్తకం మాస్ట్రో గజల్ శ్రీనివాస్ కు చేరింది. బొబ్బిలి రచనా సమాఖ్య అధ్యక్షులు మింది విజయమోహనరావు నేతృత్వంలో, నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు చివుకుల శ్రీలక్ష్మి ప్రధాన సంపాదకత్వంలో వెలువడిన ఈ పుస్తకాన్ని ముమ్మారు గిన్నిస్ బుక్ రికార్డుల గ్రహీత, ప్రముఖ గజల్ గాయకులు, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ కు నిర్వాహకులు బహూకరించారు. రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం నియోజకవర్గ శాసన సభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతి రాజు, నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం అధ్యక్షులు తేళ్ళ అరుణ, ఉపాధ్యక్షులు చివుకుల శ్రీలక్ష్మి, సహాయ కార్యదర్శి దాసరి పద్మ, పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు డా.జి.వి.పూర్ణచంద్, బొబ్బిలి రచనా సమాఖ్య అధ్యక్షులు మింది విజయమోహనరావులచే తొలుత ఉపాధ్యాయ స్పూర్తి సంకలనాన్ని ఆవిష్కరించారు. అనంతరం గజల్ శ్రీనివాస్ కు సంకలనానికి నేతృత్వం వహించిన మింది విజయమోహనరావు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు, యువ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి పొట్నూరు మాలతి, రేవెళ్ళ సతీష్ రాజు, యడ్ల శ్రీనివాసరావు, ఎస్.తిరుమల తిరుపతిరావు తదితరులు బహూకరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ స్పూర్తి సంకలనంలో రచయితలందరికీ గజల్ శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు.
గజల్ శ్రీనివాస్ కు ఉపాధ్యాయ స్పూర్తి బహూకరణ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి