చేతులు చాచి ఆనందాన్ని
అలింగనం చేసుకుని
కన్నుల ముందున్న అందాన్ని
మనసులో నిలుపుకోవాలని...
ఓరిమిగా వేచి నిలిచి
కూరిమితో స్వాగతించి
కోరిక తీరగా ఎద నిండా
చేరికగా ఉండాలని......
సాగే నీటిపై ఊగే అలలతో
ఉయ్యాలలూగాలని
వెండి మబ్బుల పల్లకిలో
కొండలన్నీ చుట్టాలని..
నీటితో చేతులు కలిపి
నిండైన స్నేహాన్ని పంచే
వంగిన కొమ్మల మాటున
దోబూచులాడాలని...
కురిసే వెలుగుల జడిలో
మురిసే నీటి జిలుగులతో
తడిసే జలతారు మెరుపులు
దోసిట నింపేసుకోవాలనిపించే
కమనీయ సృష్టిలో
కమ్మని భాగం చేసి
కనికరం కురిపించిన
కర్మసాక్షికి వందనాలతో....
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి