కొసరు: - - యామిజాల జగదీశ్
 ఆవిడ రూపం చూసేందుకు సాదా సీదా. అయితేనేం,
పేదరికంలోనూ ఎంతో నిజాయితీ.
ఇలాంటి వారి దగ్గర ఆహ్లాదకరమైన మట్టి వాసనతో కూడిన సహజమైన, రసాయనాలు లేని ఉత్పత్తులను కొనడం ఒక ప్రత్యేకమైన ఆనందమే...డబ్బులు ఇచ్చి కావలసింది అందుకుంటూ "ఇదిగో బామ్మా కొసరు లేదా?' అని  అడిగితే, ఆవిడ సంతోషంగా నవ్వి, తనకు తోచింది ఇస్తుంది.
కొసరు అంటే ఏదైనా వస్తువు కొన్న తర్వాత వ్యాపారిని అదనంగా కొంచెం ఉచితంగా అడగడం లేదా తీసుకోవడం. ఇది కొనుగోలులో భాగమైన అదనపు పరిమాణం. సాధారణంగా కూరగాయలు కొనేటప్పుడు "కొసరు" అడగడం మనం చూడొచ్చు. నా చిన్నప్పుడు ఐతే ఒకరిద్దరు అడక్కుండానే కొసరు ఇచ్చిన వారినెరుగుదును.
దేవుడిని చూడటానికి గుడికి వెళ్లాలనేం లేదు.
నిష్కపటులైన ఇటువంటి వ్యక్తులు, మన మధ్యే నడయాడే దేవుళ్లే!!

కామెంట్‌లు