*****
"అవ్వా! నువ్వేమన్న అనుగని గస్మంటి బతుకు పగోడికి సుత రావొద్దు. ఏ జల్మల ఏం పాపం చేసుకుండో... గంత అవత్త పడతాండు. గా అవత్త తీరేది గాదాయె. గిప్పటికే ఎన్నో దవాఖానలు తిప్పిండ్రు గని ఏం ఫాయిదా లేదవ్వా!"
"ఎవలు శెల్లే! గా శెలమయ్య కక్కయ్య సంగతేనా నువు జెప్పేది?"
"అవునవ్వా! గా శెల్మయ్య కక్కయ్య ముచ్చెటినే. పాపం మంచం మీద నవుస్తున్నడు. లెవ్వలేడు,కూసోలేడు. ఒకటొచ్చినా రొండొచ్చినా అన్నీ మంచంలనే అవ్వా!"
"అవును శెల్లే! కక్కయ్యని సూత్తుంటే నాకు సుత నీకు లెక్కనే అనిపిచ్చింది. పెద్దొంటి మడిషి. గలాస్కో పంచె పొడుగు లాలిచీ సొక్కా ఏసుకొని బజాట్లె అగుపడితే ఏనుగు లెక్క అనిపిచ్చేటోడు. గట్ల టీవిగా సిల్మాల ఎన్టీవోడు లెక్క అగుపిచ్చెటోడు. గస్మంటోడు గిప్పుడు మంచంల పీనుగు లెక్క పడుంటె... సూత్తుంటెనే మన్సు కలికలి అయితున్నది శెల్లే!"
"ఏమో అవ్వా! దేవుడు గా రాతెట్ల రాశిండో...కొంత మందిరి గిట్ల సూశినోళ్ళు గట్ల ఏ రోగం రొష్టు లేకుండ శెట్టాకుల లెక్క రాలిపోతుండ్రు.గీ శల్మయ్య కక్కయ్యకి తొంబై ఏండ్లు.'సావుదలకి లావు దుఃఖమని' కాలిరగ బడె. దవాఖాన్లకి తోల్కపోతె ముసలోల్లకి కట్టుకోవడం కట్టమనె. ఇంగెట్ల జెప్పు ఇంత బతుకు బతికి ఇంటెనక బడి సచ్చినట్టయిందవ్వా!"
అవును శెల్లె! "ఆయుష్షు ఆరు పాళ్ళు -యాతన ఏడు పాళ్ళు " అన్నట్టు. గా కక్కయ్య ఎన్కటి తరమోడు ఇంకా బతికుండని సంబుర పడాల్నా? ఆయుస్సును మించి యాతన బడ్తుంటే బాద పడాల్నా? ఏం ఎరిక గావట్లే శెల్లే!"
ఒకలితో శేయించుకోడమంత దురదృట్టం, నరకం ఇంకోటి లేదవ్వా! గీ వయసుల శిన్నపిల్లలెక్క తానం చేయిచ్చుడు,తాపిచ్చుడు, తినిపిచ్చుడు మొదలుకొని మూతీ, ముడ్డీ కడగాలంటే సేశేటోళ్ళకి ఎంత కట్టం,సేయిచ్చుకునేటోడికి ఎంత దుఃఖం,ఇంగ సూశేటోళ్ళకి ఎంత బాదగుంటదవ్వా!"
"అవును శెల్లే! ఆయుస్సు తగ్గిచ్చిన ఏండ్లేదు గని అవత్తలు మాత్తరం గన్నివ్వ గూడదని మనం అన్కుంటం గని మన శేతుల్ల ఏముంటది శెల్లె. యాతనలు ఏడు పాళ్ళైనా పదేడు పాళ్ళైనా కొనూపిరి ఉన్నంత కాలం సచ్చినట్టు బరిత్తూ బత్కాలె తప్పదు."
ఇగ్గో అవ్వా! నాగమ్మ జేజి సుత తెల్లారగట్ల ఒంటికి బొయ్యి కళ్ళదిరిగి పడిందట. తొంట్లెకు ఇర్గిందట.దవాఖాన్ల శెరీక జేసిండ్రంట."
"అవును శెల్లె గామెది సుత శానా పెద్దొయసాయె.ఇంగ గామె కాలం ఎట్ల గడుత్తదో ఏమో?"
గిదండీ సంగతి."ఆయుష్షు ఆరుపాళ్ళు -యాతన ఏడు పాళ్ళు" అంటే గిదే మరి."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి