****
"ఎక్కడాశారాలు ఎక్కడి పద్దతులవ్వా! గట్లుండాలే.గట్ల పాటిచ్చాలే! గిప్పటి పొల్లగాండ్లకు ఏ ఆశారాల్లెవ్వు. ఏవన్నంటె 'ఆఁ అంతా మీ శాదత్తం అన్కుంట" కొట్టి పడేత్తరు.మూతిరిత్తుండ్రు ముక్కిరిత్తుండ్రవ్వా!
"నిజమే శెల్లే! ఎన్కటోళ్ళు గా ఆశారాలు పాటిచ్చబట్టే ఆయిగ నిండ నూరేళ్లు గుండ్రాల్లొతికె బతికిన్రు. పతి ఆశారం ఎన్క ఏదో యిష్యం ఉంటది."
అవును గని అవ్వా! మన పెద్దోళ్ళు శెప్పినట్టు యినుడేగని గవి ఎందుకు పాటిచ్చాల్నో తెల్వదు. ఏదన్నైతెట్లని బయం బత్తితో గయ్యీటిని తు.శ. తప్పకుండ పాటిత్తున్న.గిప్పటి పొల్లగాండ్లకి గట్ల ఏమన్న జెప్పబోతే సరింగ యినకుండ ఎహె !పో!అని ఎకరదిచ్చుడేనాయె!"
"అవును శెల్లె! గిప్పటోళ్ళు శెప్పితె ఇనుడు లేదు.వొంట బుట్టేది లేదు.గాళ్ళకేం జెప్తమింక."
రోటితాన తుమ్మొద్దురా అంటే"ఏమైతదని ఇంకోపాలి కావాల్సుకుని గాన్నే తుమ్మేటోళ్ళు సుత ఉండ్రు. గా రోటి కాడ తుమ్మితే నోట్లెనించి తుప్పిళ్ళు రోట్లె బడతయి. గా తుమ్మినోడికి ఏదన్న జబ్బో ,రోగమో వుంటే గా తుప్పిల్ల వల్ల, గా దంచినవి తిన్నోళ్ళకి సుత వొచ్చేటివి.గస్మంటివి వొత్తయనే రోటి కాడ తుమ్మొద్దన్న ఆశారం బెట్టిండ్రు.లేపోతెనా ఎంతోమంది రోగాలపాలయ్యేటోళ్ళు.
అవునవ్వా గందుకే గీ ఆశారాలు పాటిచ్చాలే!
అవును శెల్లె! గందుకే "ఆశారాలకు అంతముండదు .అనాది నించి వొచ్చినయి అంటరు.
"గట్లనే మరి అనాశారాలకి ఆది "లేదంటరు?అంటేందవ్వా! అనాశారాలకు ఆది లేకపోవుడేంది?
అనాశారమంటెనే ఆశారం శేయకుండ ఉండటం తప్పు శేసుడు అని అర్తం.- చేయాల్సినవి మంచి వాటిని వొదిలేసుడు.
" గిప్పుడు సూడు పెండ్లి పేరంటం గనీ,బోయినాలు గని అయితే శెప్పులేస్కొనే టేజీ మీదకు బోతుండ్రు. బోయినాలు సుత గట్లనే.. శెప్పుల్తో తింటుండ్రు. ఊరంత తిరిగొత్తం.తెల్వకుండ గా శెప్పుల్తో ఏవేవో తొక్కుతం గా శెప్పులతో యిష కీములు తినే కాడికి పెండ్లికాడికి వొత్తయి గద.గవే రోగాలు తెత్తయి. గిప్పుడు ఎవలన్న ఇంటుర్రా,పాటిత్తుర్రా శెల్లె!"
"అవునవ్వా! నువ్వన్నది సుబూది అయితనే ఉంది."
"గందుకే శెల్లే ఆశారాలకి అంతం లేదు - అనాశారానికి ఆది లేదు "అనే సామెత పుట్టింది. అనాశారం నడ్మల పుట్టింది. ఆది నించి లేదుగద. మంచిగ ఆశారాలు పాటిచ్చేటోళ్ళు ఉండనే ఉండ్రు. ఎప్పుడూ వుంటనే ఉంటరు శెల్లె!"
గదండీ సంగతి "ఆశారానికి అంతం లేదు అనాశారానికి ఆది లేదు "అంటే గిదే మరి"

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి