ధీరో దాత్తుడు: నామ వెంకటేశ్వర్లు,- తెలుగు ఉపాధ్యాయులు,జి. ప. ఉ. పా. అయిటిపాముల,
వణిక్ పుంగవులు గా స్థిరపడుటకు ఏమిఎరుగని 
 ఎర్రి పుష్పంలా  మనను బామాడె నక్క వినయమున  
 
ఇసుంట రమ్మంటే ఇల్లంత నాదన్నట్లు, పాపమని పాత బట్ట
 ఇస్తే మూర జాన వేసిన చందంగా దివ్య భవ్య భారతమును దోచబట్టే సదా 

జగతిన  లేని కుల  కంపు మహమ్మారిలా
 భరత ఖండంబున  అలుముకున్న తరి 
ఉదయించే నొక ఉద్యమ  దీప్తి 

దేశ తిమిరమును ప్రాలద్రోల తల్లి విద్యావతి 
తండ్రి కిషన్ సింగ్ లకు కలిగే యతడే మహనీయ భగత్ సింగ్ 
 జాగుచేయక జాగరుకతతో దేశ విమిక్తికై 
జాతియోధ్యమం జరిపిన చక్కని పరివారం 

పువ్వు పుట్టగానే పరిమలిస్తుందన్నట్లు బాల్యదశ నుందే 
దేశభక్తిని పోషకాలుగా పుచ్చుకుని ఏపుగా ఎదిగిన మొక్కయతడు 

జగతి గతి అవలోకించుటకు చరిత్ర, రాజకీయాంశములు, 
విదేశీ రచయతల విప్లవ సాహిత్యమంటే మక్కువ చూపి 
అసాంతం అభ్యసించి ప్రేరణ పొందిన గొప్ప ప్రేరకుడు 

పంజాబ్ కేసరి పై  లోఫరులు క్రూరలు\
 తెల్ల కుక్కలు లాటీలతో మరణ మృదంగమ్రోగించిన వేళ 

జారులు చోరులు జరిపిన జలియన్ వాలా బాగ్ 
కధన భీబత్సమ్ చూడనెంచి ప్రభావితుoడైన బాహుబలి భగత్ సింగ్ 

తెల్లదొరల తరమ సమరమే శరణమని తలచి 
లాలా లజపతి దుర్మారణానికి దీటుగా  
సావాసదారులతో ఐక్యమై శాండర్స్  పై \
బాంబుతో మరణ శాసనం రాసి దెబ్బకు దెబ్బ తీసిన ధైర్య శాలి యతడే 

స్వతహాగా స్వస్థలములో 
తుపాకి పండ్లు పండించిన నవ హాలికుడతడు 

కారాఘారమున ఖైదీల యెడ అసమానతనే పిశాచి కోరలు

 పీకి సమానత కై నిరాహార దీక్ష కు పూనిన దీక్షా పరుడు 

దేవుడు దయ్యాలు మంత్ర తంత్రాలు అంతా మిధ్య యని 
తనిని తానే నమ్మి 
విజ్ఞాన తర్కంని లోచన చేయమనిన లోతైన లోచనడు 
భౌతిక వాదంబు బలపరచిన  భాగ్యోదయ 

అంధవిశ్వాసాలు అణగదొక్క వివేకము కలిగి 
హేతువాదంతో ప్రశ్నిస్తూ శక్తిని హెచ్చు చేయమన్న 
హెచ్చరిక  నిజం కోసం నికార్సుగా నిలబడమన్న  నిలువుటద్దం 

ఉరికొయ్యలకు కోదండంలా వ్రేలాడు తరి ఉరితాడును
 ముద్దాడి ఇంక్విలాబ్ జిందాబాద్,సామ్రాజ్య వాదం
 నశించాలని అవనియంత ప్రతిధ్వనింప చేసి 
నవ్వుతు నిర్యాణం పొందిన నిప్పుకణిక

కామెంట్‌లు