నవ్వు నాలుగు విధాల చేటు
అన్నది నిన్నటి మాట !
నవ్వు నలభై విధాల మేలు
అన్నది నేటి మాట !
నవ్వే ఆరోగ్యం - నవ్వే దివ్యౌషధం !
నవ్వే సోయగం - నవ్వే నయగారం!
కల్మషం లేని నవ్వు, మోము పై కాంతులు వెదజల్లు తాయి !
అందుకే_
ఎన్నటికీ చిరు నవ్వు చెరగనీయకండి,
అదే వెయ్యి ఏనుగుల బలము
ఇస్తుంది సుమా....!
మనసారా నవ్వండి ,
ఒత్తిడిని దూరం చెయ్యండి!
హాయిగా నవ్వండి ,
చిరకాలం జీవించండి !
ఆ నవ్వే - మీ ఆయుశును
పెంచు తుంది....!
ఈ నవ్వే మీ మనస్సును -
తేలిక పరుస్తుంది....!
ఇక నవ్వుతూనే ఉండండి !
ఆరోగ్యాన్ని అనుభవించండి!!
***

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి