పెదవులపై చిరునవ్వుతో
అనురాగ ఆప్యాయతలతో
అందనంత ఎత్తుకు ఎదిగినా
అహంకారానికి తావీయక
ఆత్మీయంగా బాగున్నారా అని ఎప్పుడు పలుకరించే
అసమాన్య ప్రతిభావంతులు
డాక్టర్ ఏనుగు నరసింహారరెడ్డి గారు.
సామాజిక స్పృహకలిగిన రచనలే
పాఠకుల హృదయాలను రంజింపచేయునని
తన సమాంతర స్వప్నం
నీడల దృశ్యం, కొత్తపలక,ఏడుకోలల బాయి వంటి రచనల ద్వారా
తెలిపిన ప్రజాకవి.
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమని
అర్థమందులో ఉంది అన్నదానికి మీరు ప్రతీకయే.
కవిగా, రచయితగా,తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా ,సంపాదకునిగా సాహితీ సేవచేసి
కలెక్టర్ హోదాను పొంది
ప్రజాసంక్షేమ కార్యక్రమాలను చేపట్టి
అక్షరమే ఊపిరిగా రచనలు చేస్తు
మానవత్వమే మాధవత్వమని ప్రజలసంక్షేమానికి పాటుపడుతున్న
మీరు తెలుగు విశ్వవిద్యాలయ సాహిత్య పురస్కారం ,
కళాంజలి విజ్ఞానపీఠం వారి గౌరవ పురస్కారం
తెలంగాణ రూబాయిలకు
గిడుగు రామ్మూర్తి పురస్కారాలకే వన్నె తెచ్చిన సరస్వతీపుత్రులే
అందుకోండి మీకివే నే సమర్పిస్తున్న అక్షరకుసుమాలు...!!
.............................
................................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి