బొబ్బిలి రచనా సమాఖ్య ఆధ్వర్యంలో రూపొందించిన ఉపాధ్యాయ స్పూర్తి సంకలనాన్ని జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యంనాయుడు మిక్కిలి ప్రశంసించారు. సమాఖ్య అధ్యక్షులు మింది విజయమోహనరావు నేతృత్వంలో ఇప్పటికే ఏడు సంకలనాలు విడుదల కాగా, ఎనిమిదో సంకలనం ఉపాధ్యాయ స్పూర్తి ఇటీవల విజయనగరం జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం నియోజకవర్గ శాసన సభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతి రాజు, నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం జిల్లా అధ్యక్షురాలు చివుకుల శ్రీలక్ష్మిలచే ఆవిష్కరణ కాగా, నేడు మలి ఆవిష్కరణ జరిగింది. జిల్లా విద్యాశాఖాధికారి యు. మాణిక్యం నాయుడు ఆవిష్కరణ అనంతరం తొలి పుస్తకాలను విజయనగరం ఉప విద్యాశాఖాధికారి కె.వి.రమణ, బొబ్బిలి ఉప విద్యాశాఖాధికారి కె.మోహనరావులకు బహూకరించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి యు. మాణిక్యం నాయుడు మాట్లాడుతూ విద్యాశాఖ స్వచ్ఛతకు, గుణాత్మక విద్యా సాధనకు, పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయ వ్యవస్థ తపన చెందిన తీరుకు ఈ పుస్తకం అద్దం పడుతుందని అన్నారు. మానవతా దృక్పథంతో సామాజిక బాధ్యతను గుర్తెరిగి బొబ్బిలి రచనా సమాఖ్య ముందడుగు వేస్తుందని, సమాఖ్య అధ్యక్షులు మింది విజయమోహనరావును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఉప విద్యాశాఖాధికారి కె.వి.రమణ మాట్లాడుతూ బొబ్బిలి రచనా సమాఖ్య ఆధ్వర్యంలో ఇప్పటికే ఆకుపచ్చని నేస్తం, చిట్టితల్లీ జాగ్రత్త, ప్రాణదాత, గురుబ్రహ్మ వంటి సామాజిక అంశాలతో కూడిన ఏడు సంకలనాలు వెలువడ్డాయని, వీటికోసం చిత్తశుద్ధితో కృషి సల్పిన విజయ మోహనరావు సేవలను ఆయన కొనియాడారు. ఉప విద్యాశాఖాధికారి కె.మోహనరావు మాట్లాడుతూ విజయమోహనరావు దయగల గోడ, ఆనందోబ్రహ్మ, ఘంటసాల జయంతి వేడుకలు వంటి సాంస్కృతిక, సంఘ సంస్కరణ కార్యక్రమాలతో పాటు ఉపాధ్యాయ వృత్తిలో విషయం నిపుణునిగా ప్రత్యేక విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తన జీవితం అంకితం చేసారని అన్నారు. మింది విజయమోహనరావు మాట్లాడుతూ ఈ ఉపాధ్యాయ స్పూర్తి సంకలనంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మింది విజయమోహనరావు,
చివుకుల శ్రీలక్ష్మి, కుదమ తిరుమలరావు, టేకుమళ్ళ విజయలలిత, కుసుమంచి శ్రీదేవి,
పొట్నూరు మాలతి, ఆర్.వి.రత్నం,
డా.పెన్నేటి స్వప్న హైందవి, డా.జి.శిరీషా రఘురాం, ఎస్.తిరుమల తిరుపతి రావు, రేవెళ్ళ సతీష్ రాజు, యడ్ల శ్రీనివాసరావు, భోగెల ఉమామహేశ్వర రావు, కందల రామకృష్ణారావు, మానాప్రగడ సాహితి, సాలూరు సంతోషి, ఈపు విజయ కుమార్, వేమూరి ఉషా రమణి, ఎ.ఎస్.శారద, దామరాజు విశాలాక్షి, పాటూరి ఆనందకుమార్, భమిడిపాటి లక్ష్మిలతో పాటు 77మంది స్పూర్తిగాథలున్నాయని తెలిపారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి