గుర్తుంచుకొండి...!: - కోరాడ నరసింహా రావు!
అమ్మ పడే కష్ట మంతా
మీకే కష్ట0 కలుగకుండా   మన ముఖాల్లో చిరు నవ్వులు చూడటానికే ! 

అందుకే ఆమె ఎంత కష్టా న్నైనా... 
  చిరు నవ్వుతో భరిస్తుంది

మన కడుపులు నింపటం కోసం ఆమె పస్తులు పడుకున్నదెన్ని మార్లో ! 

మనం మును ముందుకు సాగటమే... 
  అమ్మ ఆశయం...! 
 అందు కోసమే... అమ్మ మన వెనకే మన బాధ్య తల భారాన్ని మోస్తూ...వస్తుంది...!! 

మరిచి పోవద్దు ఛిన్నా... 
 అమ్మ ప్రేమను మరచి పోవద్దు కన్నా.... 
   రేపు మీరు పెరిగి పెద్ద వారై, ప్రయోజకులైన రోజున... 
   అమ్మను అనాధను చేసి  
మీదారి మీరు చూసుకో వద్దు నాన్న...! 

అప్పుడు మీ అమ్మను మీరు కన్న మీ పాపను చూసు కున్నంత ముద్దుగా 
 ప్రేమగా చూసు కోవాలి ... 
  గుర్తుంచు కొండి...!! 
     ******

కామెంట్‌లు