అందరికీ ఆరోగ్యం ఉండాలని
ఆరోగ్యకర సమాజం అభివృద్ధికి కారకమని
ఏ పని చేయాలన్న శరీర దారుడ్యం అవసరమని
ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగు పడునోయ్ అన్న
మహాకవి గురజాడ చెప్పినట్లు
ఆరోగ్య వంతమైన సమాజంలో
సాధించలేనిది ఏది లేదని
ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రతి సంవత్సరం
ఏప్రియల్ 7 వతేదీన
ప్రజల అనారోగ్య నిర్మూలనకై
పలు దేశాల కలయకతో
సమాజ కల్యాణం గురించి
వ్యాధి నిర్మూలన కోసం
పరస్పర అవగాహన తో
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నారు
ఈ సంవత్సరం ఆరోగ్యకోసం
కలసికట్టుగా విజ్ఞానానికి అండగా నిలబడదాం
అపుడే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ చేకూరును అనేది ఇతివృత్తంగా సభలు, సదస్సులతో
ప్రజలకు ప్రేరణ కలగించాలన్న ఆశయంతో
ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో సమాజాభిద్ధికి వసుదైకమంతా పాటు పడాలని నిశ్చయించడం ముదావహం.!
...........................
...........................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి