అలలు అలలుగా
అరుణ వర్ణము
అపరంజి వెలుగులో
కలిసిపోతుంటే....
పొరలు పొరలుగా
చీకటి తెరలు
భువికి వీడుకోలంటూ
వెలుగులో మాయమవుతుంటే...
గుంపులు గుంపులుగా
మబ్బులు పరుగెడుతూ
ప్రభవించు ప్రభువుకు
బహుపరాకులు చెబుతుంటే...
గుస గుసలుగా గాలి
వసుధకు కబురివ్వాలని
చల చల్లగా వీస్తూ...
మెల్లగా మేలుకొలుపుతుంటే....
దూర దూర తీరాన
నీలి తెరల చాటున
ఆకు చాటున దాగిన
పండులా కొంచెమే కనిపిస్తుంటే
ఎదిగి ఎదిగి రవి బింబము
పగడపు బంతి తీరున
గగనాన వెలుగు కాంతి కలశంలా
అగుపించు ఆదిత్యునికి.
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి