సుప్రభాత కవిత : - బృంద
నింగిని ఒలికిన 
బంగరు  కలశం 
కనక  కాంతులు 
కురిసి తడిసే జగం

రేయిని మెరిసిన 
చుక్కలు కొన్ని 
నేలను  రాలి 
విరిసెను పూలై

వెచ్చగ తాకిన 
ప్రేమకు మురిసి 
ఊయలలూగే 
కొమ్మను నిలిచి

చక్కని రూపం 
చల్లని నవ్వు 
అదే జీవితం 
చిన్ని తోటలో....

చూసిన కనులకు 
కలుగు మోదం 
నవ్వే పువ్వుకు 
అదే ఆనందం....

వడలి పోతానని 
తెలిసికూడా 
సడలనివ్వదు 
తన సంతోషం

వర్ణమయమైన 
వనం లాగే 
స్వర్ణ స్వప్నాలు 
నిజం చేసే వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు