విఘాతాలని ఎదుర్కొంటే విజయమే: - కవి మిత్ర, సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్(పుష్యమి) విశాఖపట్నం
అనుకున్నావని జరుగవు ఆన్ని
అనుకోలేనివి జరుగును కొన్ని
జరిగేవన్ని  మంచికని
అనుకోవడమే మనిషి పని అన్నాడో మహాకవి
ఆత్మవిశ్వాసం, దృఢసంకల్పంతో
విఘాతాలు ఎదురైనా అదరక బెదరక వెనుదిరుగక
ముందుకు సాగితే విజయమే నీ వశమగును అన్న స్వామి వివేకానంద
అవరోధాలు ఎదుర్కొని ముందుకు సాగితే
విజయమే తధ్యమన్న
హిందూ సామ్రాజ్య స్థాపకుడు వీర శివాజీ
జీవితమంటే  ఆటు పోట్లు
కష్ట సుఖాలు
వాటిని సమానంగా స్వీకరించి
స్థితప్రజ్ఞతకు దర్పణంగా ఉంటే
విఘాతాలని ఎదుర్కొంటే విజయమే నీ దరి చేరును....!!
..........................


కామెంట్‌లు