యుద్ద మంటే....; - కోరాడ నరసింహ రావు,
ఇద్దరు వ్యక్తులమధ్యనైనా కావచ్చు.... 
  రెండు దేశాల మధ్య నై నా కావచ్చు ...! 
 అది అలాముదిరి... ప్రపంచ యుద్దంగా పరిణ మించనూ వచ్చు....!! 

ఈ బాహ్య భౌతిక యుద్దా ల గురించి కాదు చెప్పేది! 

ఈ యుద్దాలన్ని కష్ట ములను, నష్టములను
 బాధలను మిగుల్చు తా యే తప్ప..., 
శా0తి ఎలా వస్తుంది..!? 

నిజ మైన శా0తి యుద్దం తరువాతే...., 
  ఐతే... ఈ శా0తికోసం బాహ్య యుద్దం కాదు నీ వు చేయ వలసింది...! 
 అంతర్ ముఖం లో అరి షడ్వ ర్గాలతో....! 
 మమ కార వికారాలతో!! 

ఆ యుద్దం లో నువ్ గెలవ గలిగితే అప్పుడు అది నిజమైన శా0తి !! 
     ***


కామెంట్‌లు