ఉగాదిఅంటే మన జీవన సౌధానికి
పునాది.🪸
పువ్వంటే పువ్వుకాదు.
పండంటే పండుకాదు.
చింత పండు ,వేపపువ్వు
కలిసిందే ఉగాది పచ్చడి.
కాలానికి హద్దులు చెప్పి,మానవులకు
బుద్ధులు నేర్పి.
కాలాన్నిబంగారంలా ఉపయోగించి.
వృద్ధిచెందుమని
చెప్పేదే ఉగాది పండుగ.🌷
చెవినివేసుకో,ఆహ్వానించు.ఆనందం వెల్లివిరియగా,పచ్చదనం పరిమళించగా,
పూర్ణ స్వర వసంత రాగం వసంత వనిత అలపింపగా. పికజాతములానందింప ప్రపంచమంతా మల్లె,
మొల్లల,మరువపు
టాకుల గంధ భరితమై,
మనసున మల్లెల మాలలూగగా,
🌸🌷🩱🍁
మానవ జీవిత బృందావనిలో
కవుల కలలకు కలాలనిచ్చి పచ్చని,విచ్చిన పదపుష్పముల పద్మనాభుని
పాదపూజలను
చేయమనుచును
చక్కెర గడతో మండలించుచు,
ఉగాది పచ్చడి పరమార్ధాన్ని విప్పిచెప్పేవివరణ
చూడు.మనస్తత్వాలు ఎన్నో ఉన్నా మనుషులందరు
కలిసుండాలి.క్షణాలు,నిముషాలు గంటలు
దినాలు వారాలై వేరే వేరే గమనాలున్నా
వత్సరం ఒక్కరే కాలానికితుది.అదే సంవత్సరాది.అదే మన ఉగాది.ఉత్సా హాలకు పునాది
."నాది" అని తెలుగువాడు గొప్పగా చెప్పుకొనే
సంవత్సరాది.మత్సరాలు మాని పలుకుదాం
స్వాగతం.గతంనాస్తి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి