వేగ రావయా....! : - కోరాడ నరసింహా రావు
మత్స్యమై జనియించె
  వేదాలు కాపాడ..! 
మున్ను వరాహ ముగ అవతరించె... 
   భూ దేవినే రక్షి0చ! 
కూర్మ మై నిలిచెను అ మృతమును పొందగా
      భక్త ప్రహ్లాదు కాపాడగా... 
  నార సింహుడై  వెలసేను

వామనునిగా,పరసు రామునిగ 
శ్రీ రామునిగాను... 
  గీతను  బోధించు శ్రీ క్రుష్ణునిగను 
 దుష్ఠశిక్షణయు,ధర్మరక్షణ గావించితివి...! 
  నారాయణ నీ మహిమ 
బొగడగా నా తరమా...!! 
 దేవ దేవ దీన బందు 
 కల్కి వై వేగ రావయా...! 
     *****

కామెంట్‌లు