అక్కడ ఒక ప్రేమ ఉంటుంది. : -డా ప్రతాప్ కౌటిళ్యా -సునీతా ప్రతాప్.
గుండె పగిలింది 
మనసు విరిగింది 
మతిభ్రమించింది. 
ప్రేమతో రండి 
అక్కడ ఒక ఇల్లు ఉంటుంది.!!

భూకంపం వచ్చింది 
అగ్నిపర్వతం పేలింది 
వరద వచ్చింది ఉప్పెన కమ్మింది 
ప్రేమతో రండి 
అక్కడ ఒక ఇల్లు ఉంటుంది.!!

ఆకలేసింది 
దప్పికేసింది
ఊపిరి ఆగిపోతుంది 
ప్రేమతో రండి 
అక్కడ ఒక ఇల్లు ఉంటుంది.!!

రక్తం కారుతుంది 
కన్నీరు పారుతుంది 
గాయమయ్యింది 
శరీరం కూలిపోతుంది 
ప్రేమతో రండి 
అక్కడ ఒక ఇల్లు ఉంటుంది.!!

కాలం బుస కొడుతుంది 
పౌరుషం పగబడుతుంది 
మోసం మీసం తిప్పుతుంది 
నమ్మకం నలిగిపోతుంది 
ప్రేమతో రండి 
అక్కడ ఒక ఇల్లు ఉంటుంది.!!

ద్వేషం దెబ్బలాడుతుంది 
వివక్ష కక్షగడుతుంది 
స్వేచ్ఛ చచ్చిపోతుంది 
పరువు కరిగిపోతుంది 
భయం భయపెడుతుంది 
ప్రేమతో రండి 
అక్కడ ఒక ఇల్లు ఉంటుంది.!!

యుద్ధంలో ఓడిపోయిన 
సర్వం కోల్పోయిన 
మాట పడిపోయిన 
ఒంటరివైన ప్రేమతో రా 
అక్కడ ఒక ఇల్లు ఉంటుంది!
అక్కడ ఒక ప్రేమ ఉంటుంది!!

డా ప్రతాప్ కౌటిళ్యా 
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.

కామెంట్‌లు