ఒకే కొమ్మ పువ్వులం: - కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-విశాఖపట్నం
ఒకే రక్తం పంచుకు పుట్టినా
ఏకోదరులమైనా 
ఒకే కొమ్మ పువ్వులమైనా
అమ్మకన్నా ఆప్యాయతతో పెంచిన అక్కతో
అల్లరిచేస్తున్న వాడినేమి అనవేమన్న కొడుకులతో
వాడు మీకన్న చిన్నవాడని 
నన్ను ఎత్తుకుని బొమ్మలకొలువుకి తీసుకెళ్ళినా
నూకాలమ్మ తీర్థంలో రంగుల రాట్నం ఎక్కించిన
పరమేశ్వరి హాలులో
పరమానందయ్య శిష్యులకథ చూపించి
నేను పెద్దవాడయిన
పిల్లలు మనుమల నెత్తిన
తన కూతురు నా భార్య అయినా
వాడికేమి తెలియదని
ఆడదానివి సర్దుకోమని
కన్నకొడుకులతో మామయ్య ప్రసాదం మీకన్నా చిన్నవాడు జాగ్రత్తగా చూసుకోండి అని
నా రిటైర్మెంట్ నాడు తలకు నూనె రాసి
నీకు ఆరవై ఏండ్లు వచ్చాయి
నా పిల్లలు ఇంకా పెద్దవాళ్ళన్న
నా తోబుట్టువు పేరుకు తగ్గట్టు లక్ష్మీయే
సహస్రమాస జీవితాన్ని కొనసాగించి  శ్రీరాముని దరి చేరి
పది సంవత్సరాలయింది
గాంధీ మాహాత్మునికి పూలదండ వేసినది
ఖద్దరు గౌనులు కట్టుకు
తెన్నేటి ,టంగుటూరి 
వావిలాల వారితో వెళ్ళినది
స్వాతంత్ర్య సమయంలో 
పితృదేవులు పూర్ణయ్య పంతులు పడిన కష్టాలు
ఎన్నో ఎన్నెన్నో చెప్పిన
తోబుట్టువు కు ఏమివ్వగలను
అందుకే నా అక్షర కుసుమాలు సమర్పిస్తున్నా.....!


(జాతీయ తోబుట్టువుల  దినోత్సవం సందర్భంగా)
.............................

కామెంట్‌లు