ఆమె నవ్వుతూ నిత్యo తిరిగితేనే
ఇంటిల్లిపాటు నవ్వులనిలయం అయ్యేది
కుటుంబానికి నిత్య సంతోషాలనిది మహిళ
ఆమె గలగలపారే గోదావరి ఐతేనే
ప్రకృతి సంప్రదాయాల లోగిలిలో విరిసేది
సమాజానికి నిజమైన పట్టుకొమ్మ మహిళ
ఆమె కోటివెలుగులు నింపే కోవెల ఐతేనే
ప్రతి మనిషిలో నిత్య వసంతమై విరిసేది
ప్రపంచానికి వినోదాల లోగిలి మహిళ
నిత్యం శ్రమను ముచ్చటగా ముద్దాడితేనె
తియ్యని ఫలాలు ముంగిలిలో నిలిచేది
నిన్న నేడు ప్రతి మనిషికి చక్కని చుక్కాని మహిళ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి