మతిమరపుతో...: - - యామిజాల జగదీశ్
 ఒకానొక కారు దాదాపు ఇరవై ఏళ్ళపాటు ఒకే చోట ఉండి, నెమ్మదిగా కలుపు మొక్కలలో కలిసిపోతోంది. అయితే ఫ్రాంక్‌ఫర్ట్ పోలీసులు 2017లో ఆ కారును స్వాధీనం చేసుకుని సంబంధిత కారు యజమానిని గుర్తించి ఆయనకు అందజేసిన వైనమిది.
1997లో తన కారును ఎవరో దొంగిలించినట్లు కారు యజమాని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు రంగంలో దిగి ఆ కారును "స్వాధీనం" చేసుకున్నారు. 
తీరా 76 ఏళ్ల ఆ కారు యజమాని చెప్పిన విషయంతో పోలీసులు కంగుతిన్నారు.‌
అదేంటంటే, ఇరవై ఏళ్ల క్రితం దాన్ని ఎక్కడ పార్క్ చేశానో మర్చిపోయానని, అంతేతప్ప ఎవరూ ఎత్తుకెళ్ళ లేదని చెప్పడం! 
దొంగతనమూ జరగలేదు, ఎటువంటి నేరమూ లేదు. కేవలం మతిమరుపు వల్ల జరిగిన ఒక పెద్ద పొరపాటు.


కామెంట్‌లు